Share News

National Herald case: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:25 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.

National Herald case: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు నిరాకరించింది. ఇప్పటికిప్పుడు నోటీసులు ఇవ్వలేమని, ఈడీ సమర్పించిన డాక్యుమెంట్లు సమగ్రంగా ఉన్నాయా లేదా అనేది ముందుకు తాము పరిశీలించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

JK LG Manoj Sinha: ఉగ్రవాదులను వేటాడండి... ఆర్మీ చీఫ్‌ను కోరిన ఎల్జీ మనోజ్ సిన్హా


ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది. దీనిపై గోగ్నె స్పందిస్తూ, నోటీసు అనివార్యతపై ముందుగా మదింపు చేసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని, నోటీసు అనివార్యత ఉందని కోర్టు సంతృప్తి చెందితే కానీ అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు.


ఈడీ ఫిర్యాదులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, చార్జిషీటులో చెప్పిన కొన్ని డాక్యుమెంట్లు మిస్సింగ్ అయినట్టు కోర్టు ఆఫీసర్ గుర్తించారని, ఆ డాక్యుమెంట్లను ఈడీ సమర్పించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ తర్వాతే నోటీసులు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. అయితే పారదర్శకంగా ప్రొసీడింగ్స్ జరిగాయని, ఎలాంటి సమాచారాన్ని దాటిపెట్టలేదని ఈడీ వాదించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను మే 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.


నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఈడీ వాదనగా ఉంది. దీనిపై ఈడీ చాలాకాలంగా విచారణ జరుపుతోంది. ఇటీవల చార్జిషీటులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కూడా చేర్చింది. అయితే, తామెలాంటి తప్పిదాలకు పాల్పడలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే తమపై కేసులు బనాయించినట్టు ఆరోపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

For National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 04:27 PM