Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం
ABN , Publish Date - Apr 11 , 2025 | 03:36 PM
గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్‌జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవుర్ రాణా Tahawwur Rana)ను ఎన్ఐఏ భారతదేశం తీసుకువచ్చి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో ఆనాటి భయానక ఘటన, తనకు ఎదురైన అనుభవాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ (Himanta Biswa Sarma) గుర్తుచేసుకున్నారు. 2008 నవంబర్ 26న దాడి జరిగిన రోజు తాను తాజ్ హోటల్‌లో బస చేయాల్సి ఉందని, అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్‌లో దిగానని చెప్పారు. దీంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అన్నారు. అప్పట్లో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌లో ఉన్నారు.
Tahawwur Rana Extradition: యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పాటు: కపిల్ సిబల్
ఉగ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్‌జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శర్మ తెలిపారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ దాడి వెనుకనున్న కుట్రదారులందరికీ ఏదో ఒకరోజు శిక్షపడుతుందని అన్నారు. పదహారేళ్ల తర్వాత తహవుర్ రాణాను భారత్‌లో చూస్తుంటే న్యాయవ్యవస్థపై ధీమా పెరుగుతోందని, కేంద్రంలో బలమైన నాయకత్వం ఉంటే ఇండియాపై దాడి చేయాలంటే ముష్కరులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని అన్నారు.
పాకిస్థాన్ మూలాలున్న రాణా ముంబై ఉగ్రదాడుల కుట్రదారుల్లో ఒకడిగా ఉన్నాడు.2009లో అతన్ని షికాగోలో అరెస్టు చేసినప్పటికీ నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ తర్వాత మరో కేసులో జైలుశిక్ష పడటం, ఎన్ఐఏ అమెరికా వెళ్లి అతన్ని రప్పించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఎట్టకేలకు ట్రంప్ సర్కార్ అతన్ని అప్పగించేందుకు అంగీకరించడంతో ఎన్ఐఏ అధికారులు గురువారంనాడు భారత్ తీసుకువచ్చారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనకు 18 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది.
ఇవి కూడా చదవండి..