Speaker Om Birla: ఇక ప్రతి ఎంపీ పంచ్ కొట్టాల్సిందే
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:39 AM
వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచి లోక్‌సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది.

లేదంటే అలవెన్స్‌లు కట్
న్యూఢిల్లీ, జూలై 14: వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నుంచి లోక్‌సభ సభ్యులకు నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానుంది. సమావేశాలకు హాజరయ్యే సభ్యులు ‘పంచ్’ నమోదు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అన్ని రకాల అలవెన్సులు పొందేందుకు సభ్యులకు ఈ నూతన హాజరు వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారని తెలుస్తోంది. సమావేశాలు జరుగుతున్నప్పుడు, ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యుల హాజరీ పెంచేందుకు ప్రతిపాదించిన నూతన అటెండెన్స్ విధానం అమలు పట్ల స్పీకర్ ఓం బిర్లా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. కాగిత రహితంగా పార్లమెంట్‌ను మార్చేందుకు ఓం బిర్లా గతేడాది డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.