MP: ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు..
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:58 PM
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.

- ఎంపీ కుమార్ నాయక్
రాయచూరు(బెంగళూరు): మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Mysore Urban Development Authority) పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్(Raichur MP G Kumar Nayak) స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఉత్సవాలకు ఆహ్వానించలేదని..
కాగా ఈ కేసు జరిగిన సందర్భంలో తాను మైసూరు జిల్లాధికారిగా పని చేయలేదని అప్పటికే తానింకా బెళగావిలో జడ్పీ సీఈఓగానే విధులు నిర్వహిస్తున్నట్లు కుమార్ నాయక్ వివరించారు. అదే సమయంలో ముడా వ్యవహారంలో డీనోటిఫికేషన్ పూర్తి నిబంధనల మేరకే సాగిందంటు పలు ఉదామరణలను నిబంధనలను కుమార్ నాయక్ వివరించారు. డీనోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతి జరిగిందని నిబంధనల ఉల్లంఘన సాగిందని వస్తున్న వార్తలను ఖండించిన కుమార్ నాయక్ తాను మైసూరు జిల్లాధికారిగా పని చేసిన సమయంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని డీనోటిఫికేషన్ పూర్తి పారదర్శకంగానే నిబంధనల మేరకే నిర్వహించామని ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు.
తనను రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరడం హాస్యస్పదమని ఎంపీ అన్నారు. 2004లో జరిగిన వ్యవహారానికి సంబంధించి 2025లో రచ్చ చేస్తున్న నాయకులు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తనను రాజీనామా చేయాలని కోరడం విడ్డూరమన్నారు. నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలకు తాను ద్రోహం చేయనని తాను రాజీనామా చేసే ప్రసక్తే ఉండదన్నారు. తాను అసలు తప్పే చేయనప్పుడు రాజీనామా ప్రసక్తే ఉండదని ఎంపీ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News