Share News

Monsoon Havoc: హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల బీభత్స, భయానకం

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:55 PM

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో..

Monsoon Havoc: హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల బీభత్స, భయానకం
Monsoon havoc in Himachal Pradesh

ఇంటర్నెట్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రాంతంలో ఇప్పటివరకూ 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Himachal-Pradesh-Rains-6.jpgఈ ఏడాది రుతుపవనాల ఆగమనం నుంచీ ఇదే ఉగ్ర వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక వరదలు, భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి కనీసం 72 మంది ప్రాణాలు కోల్పోయారని, 40 మంది గల్లంతయ్యారని, 100 మందికి పైగా గాయపడ్డారని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నివేదించారు.

Himachal-Pradesh-Rains-5.jpgరాష్ట్రంలో 14 ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించాయని, మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశాయని ముఖ్యమంత్రి సుఖు చెప్పారు. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) ప్రాథమిక అంచనాల ప్రకారం, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం రూ.541 కోట్లుగా అంచనా వేయగా, వాస్తవ నష్టాలు రూ.700 కోట్లకు దగ్గరగా ఉండవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నష్టానికి సంబంధించి ఇంకా నివేదికలు వస్తున్నాయి. అనేక భవనాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలు మార్లు రెడ్, ఆరంజ్ రెయిన్ అలర్ట్స్ జారీ చేశారు.

Himachal-Pradesh-Rains-4.jpgకాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాల్లో ఆదివారం అతి భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ, సోమ, మంగళవారాల్లో ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు కూడా ఆరంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఆరంజ్ అలర్ట్ తీవ్రమైన వాతావరణ ముప్పును సూచిస్తుంది.

Himachal-Pradesh-Rains-3.jpgఇక, నిన్న శుక్రవారం సాయంత్రం నుండి నమోదైన వర్షపాత లెక్కల ప్రకారం జోగిందర్‌నగర్‌లో 52 మి.మీ, నహాన్, పాలంపూర్‌లో 28.8 మి.మీ, ఉనాలో 18 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది.

Himachal-Pradesh-Rains-2.jpgజిల్లాల వారీగా మృతుల సంఖ్య వివరాలు చూస్తే, మండిలో డజనుకు పైగా చనిపోగా, 40 మంది తప్పిపోయినట్లు సమాచారం. కాంగ్రా జిల్లాలో 13 మంది మరణించారు. చంబా జిల్లాలో 6 గురు, సిమ్లా జిల్లాలో 5 మంది, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కిన్నౌర్, కులు, లాహౌల్ స్పితి, సిర్మౌర్, సోలన్, ఉనాలో కూడా మరణాలు సంభవించాయి.

Himachal-Pradesh-Rains-1.jpg


ఈ ప్రకృతి వైపరీత్యం 500 కి పైగా విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌లను ప్రభావితం చేసింది. పదివేల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 281 నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా స్వచ్ఛమైన నీరు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో సంక్షోభం తలెత్తింది. మొత్తం 300 ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా పనిచేయడం లేదు.


ఇక, వరదల్లో 164 పశువులు సహా 300 కి పైగా మూగ జీవాలు చనిపోయాయి. వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మండి జిల్లాలో పెద్ద ఎత్తున సహాయ, పునరావాస, గాలింపు కార్యకలాపాలు చేపట్టింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), స్థానిక అధికార సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.


ముఖ్యమంత్రి ప్రతి బాధిత కుటుంబానికి అత్యవసర ఇంటి సహాయంగా రూ. 5,000 ప్రకటించారు. ప్రభుత్వ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ మండిలోని సిరాజ్ లోయలోని తన నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. తునాగ్‌లో ఆకస్మిక వరదల తర్వాత సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి సుఖుతో మాట్లాడి, హిమాచల్ ప్రదేశ్‌కు మాత్రమే కాకుండా గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రుతుపవనాల ప్రభావిత రాష్ట్రాలకు కూడా కేంద్ర సహాయాన్ని అందించారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Himachal-Pradesh-Rains-7.jpg


ఇవి కూడా చదవండి

పెట్రోల్ విషయంలో గొడవ.. పోలీస్‌ను కొట్టిన పెట్రోల్ బంక్ సిబ్బంది..

ట్రంప్ ముందు మోదీ తలొంచుతారు.. రాహుల్ సెటైర్లు.

Updated Date - Jul 05 , 2025 | 06:04 PM