MK Stalin: నోరు అదుపులో పెట్టుకోండి... కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్టాలిన్
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:59 PM
ధర్మేంద్ర ప్రధాన్ 'అహంకార చక్రవర్తి' అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, ఆయన ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎంకే స్టాలిన్ సూచించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.

న్యూఢిల్లీ: పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం అమలుపై డీఎంకే ప్రభుత్వానికి నిజాయితీ లోపించిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని కేంద్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అంతే వేగంగా తిప్పికొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ 'అహంకార చక్రవర్తి' అని, తమిళనాడు ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదని, మంత్రి ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలని సూచించారు. తనను తాను 'కింగ్'గా అనుకుంటూ అహంకారంతో మాట్లాడుతున్న ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్లాలిన్ ఒక పోస్ట్ పెట్టారు.
NEP, Language Row: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. డీఎంకేపై ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుదాడి
కేంద్ర ప్రభుత్వ PM SHRI స్కీమ్ అమలుకు తాము ముందుకు రాలేమని తమిళనాడు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందని స్టాలిన్ అన్నారు. నూతన విద్యా విధానం, త్రిభాషా విధానం, PM SHRI MoUలను తమిళనాడు తోసిపుచ్చడంపై ధర్మేంద్ర ప్రధాన్ తనకు రాసిన లేఖను స్టాలిన్ ప్రస్తావిస్తూ, డీఎంకే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం అని, నాగపూర్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబుడే బీజేపీ నేతల మాదిరి కాదని ఆక్షేపణ తెలిపారు. తమిళనాడు ప్రజలను అవమానిస్తూ ధర్మేంద్ర ప్రధాని మాట్లాడిన మాటలను ప్రధాని సైతం ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు.
దీనికి ముందు, ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో మాట్లాడుతూ, తమిళనాడు సంక్షేమం పట్ల డీఎంకే ప్రభుత్వానికి నిజాయితీ లోపించిందని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని విమర్శించారు. భాషాపరమైన అవరోధాలు కల్పించడం ఒక్కటే వారి పని.. వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. రాద్ధాంతం చేస్తున్నారు. అది అప్రజాస్వామికం, అనాగరికం అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. PM SHRI పథకం ఎంఓయూపై సంతకం చేసేందుకు మొదటి అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుందన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు. ఈ పథకంపై ఎంఓయూపై సంతకాలు చేయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన డీఎంకీ ఎంకీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసారు.
ఇవి కూడా చదవండి
Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న
Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.