PM Modi US Visit: మోదీ ఆమెరికా పర్యటనపై విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే?
ABN , Publish Date - Jan 31 , 2025 | 06:41 PM
కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోనులో సంభాషించుకున్నారని, సాధ్యమైనంత త్వరగా మోదీ అమెరికాలో పర్యటించేందుకు ఇరుదేశాల అధికారులు కసరత్తు చేస్తున్నారని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటించే అవకాశంపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) స్పష్టత ఇచ్చింది. కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోనులో సంభాషించుకున్నారని, సాధ్యమైనంత త్వరగా మోదీ అమెరికాలో పర్యటించేందుకు ఇరుదేశాల అధికారులు కసరత్తు చేస్తున్నారని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు. ఇండో-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా మోదీ పర్యటన ఉంటుందని, ఏ తేదీల్లో అమెరికా వెళ్తారనేది త్వరలోనే తెలియజేస్తామని వివరించారు.
Sonia Gandhi: సోనియా వ్యాఖ్యలను తప్పుపట్టిన రాష్ట్రపతి భవన్
26/11 ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను ఇండియాకు రప్పించే విషయమై జైశ్వాల్ మాట్లాడుతూ, నిందితుడి పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసిందని, దీంతో సాధ్యమైనంత త్వరగా అతన్ని భారతదేశానికి అప్పగించేందుకు అవసరమైన విధివిధానాలపై అమెరికాతో సంప్రదింపులు సాగిస్తున్నామని చెప్పారు.
అక్రమ వలసలపై..
అక్రమ వలసలపై ఇండియా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, వీటిని ఎట్టపరిస్థితుల్లోనూ అంగీకరించరాదన్నదే భారత్ వైఖరి అని తెలిపారు. మైగ్రోషన్, మొబిలిటీపై ఇండియా-యూఎస్ మధ్య పరస్పర సహకారం ఉందన్నారు. అక్రమ వలసల నిరోధానికి అవసరమైన ప్రక్రియతో ముందుకు వెళ్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News