Share News

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:35 PM

విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.

Ballari: కమలాపురం చెరువులో చేపల మృతి

- ఆందోళనలో మత్స్యకారులు...

బళ్లారి(బెంగళూరు): విజయనగర జిల్లా, కమలాపురం(Kamalapura) చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది. ప్రస్తుతం చెరువులో చేపలు మృతి చెంది పైకి తేలుతుండడంతో మత్యకారులు చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళలేక పోతున్నారు. చెరువు గట్టుపై గుట్టౄగుట్టలుగా మృతి చెందిన చేపలు చేరుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


pandu1.jpg

ఈ మధ్యనే కురిసిన వర్షం కారణంగా చెరువలో ఎక్కువగా వరద నీటి చేరింది. చుట్టుప్రక్కల వ్యవసాయ పొలాల నుండి పంటలకు వేసిన పురుగు మందులు వర్షం నీటితో చేరి చెరువులో కలిసిన కారణంగానే చేపలు మృతి చెందినట్లు ప్రజలు భావిస్తున్నారు. విజయనగర(Vijayanagara) కాలంలో నిర్మించిన కమలాపురం చెరువు క్రింద వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుండి రాయబసవ కాలువ ద్వారా ఈ చెరువు నీరు చేరుతుండడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నీటి రక్షణకు కుట్టి రోబోలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 21 , 2025 | 12:35 PM