Share News

Mani Shankar Aiyar: రెండుసార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని అయ్యారో?: మణిశంకర్ అయ్యర్

ABN , Publish Date - Mar 05 , 2025 | 07:00 PM

రాజీవ్‌గాంధీ, తానూ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో కలిసి చదువుకున్నామని, అప్పటి పరీక్షల్లో ఆయన ఫెయిలయ్యారని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. సహజంగా విశ్వవిద్యాలయం తమ రెప్యుటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో అందర్నీ ఉత్తీర్ణులను చేయాలని చూస్తుందన్నారు.

Mani Shankar Aiyar: రెండుసార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని అయ్యారో?: మణిశంకర్ అయ్యర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి ఆ పార్టీని ఇరకాటంలో పెట్టారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అకడమిక్ రికార్డును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు పరీక్షల్లో ఫెయిలైన ఆయన దేశ ప్రధాని ఎలా అయ్యారోనని ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్


రాజీవ్‌గాంధీ, తానూ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో కలిసి చదువుకున్నామని, అప్పటి పరీక్షల్లో ఆయన ఫెయిలయ్యారని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. సహజంగా విశ్వవిద్యాలయం తమ రెప్యుటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో అందర్నీ ఉత్తీర్ణులను చేయాలని చూస్తుందని, అయితే రాజీవ్ ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో కూడా రాజీవ్ గాంధీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని చెప్పారు. ''రెండు సార్లు పరీక్షల్లో ఫెయిలై, పైలెట్‌గా పనిచేసిన వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను ఊహించలేదు. ఇదెలా సాధ్యమయిందో?'' అని మణిశంకర్ అయ్యర్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


మణిశంకర్ అయ్యర్ గతంలోనూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ కెరీర్ ఎదుగుదలకు, పతానానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. కాంగ్రెస్‌లో చిన్న నేతలకు అంత గుర్తింపు ఉండదని, రాహుల్, ప్రియాంక గాంధీలతో తాను ఒకటి, రెండుసార్లు మాట్లాడాడని, ప్రియాంక అప్పుడప్పుడు ఫోన్ చేసి తన క్షేమసమాచారం కనుక్కొంటారని చెప్పారు.


కాగా, రెండు సార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని ఆయ్యారోనంటూ మణిశంకర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత అమిత్ మాలావీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. ఆయనను (అయ్యర్) ముసుగు తొలగించనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తాం: యోగి

Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 08:53 PM