Pahalgam Attack: పహల్గాం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:15 PM
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ముంబై: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన 6 కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారంనాడు ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని, వారి పిల్లల చదువులు, కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
Supreme Court: జాతీయ భద్రతకు స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి? పెగాసస్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగదాడి మృతుడు సంతోష్ జగదలే కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది.
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
దీనికి ముందు, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..