2006 Mumbai Train Bombings: రైళ్లలో బాంబు పేలుళ్ల కేసు తీర్పుపై సుప్రీంలో అప్పీలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:01 AM
బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని..

న్యూఢిల్లీ, జులై 22: బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై గురువారం సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఇది తీవ్రమైన విషయమని, అత్యవసర ప్రాతిదికన కేసును స్వీకరించాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతిని ధర్మాసనం అంగీకరించింది. హైకోర్టు సోమవారం తీర్పు ఇవ్వగా ఇప్పటికే ఎనిమిది మంది జైలు నుంచి విడుదలయ్యారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2006లో ముంబయి లోకల్ ట్రైన్‌లో జరిగిన బాంబు పేలుడులో 180మందికిపైగా మృతి చెందడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి