Caner Vaccine: 14 ఏళ్ల లోపు బాలికలకు ఉచిత కేన్సర్ వ్యాక్సిన్
ABN , Publish Date - Mar 01 , 2025 | 08:04 PM
మారుతున్న జీవినవిధానంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేన్సర్ వ్యాధులు పెరుగుతున్నారని, గతంలో నిర్దిష్టమైన వ్యసనాలు ఉన్నవాళ్లే కేన్సర్ బారిన పడేవారని, ఇప్పుడు పిల్లలతో సహా అన్ని వయస్సుల వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కేన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తుండటంతో 14 ఏళ్ల లోపు బాలికలకు ఉచిత కేన్సర్ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Karnataka: కర్ణాటకలో బర్డ్ ఫ్లూ.. రాష్ట్రమంతా హై అలర్ట్
మారుతున్న జీవినవిధానంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేన్సర్ వ్యాధులు పెరుగుతున్నారని, గతంలో నిర్దిష్టమైన వ్యసనాలు ఉన్నవాళ్లే కేన్సర్ బారిన పడేవారని, ఇప్పుడు పిల్లలతో సహా అన్ని వయస్సుల వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. 14 ఏళ్ల లోపు బాలికలకు ఉచిత వ్యాక్సిన్ సదుపాయం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్‌ను కోరామని, ఆయన వెంటనే అంగీకరించారని తెలిపారు.
"బర్డ్‌ఫ్లూ'' ముందస్తు జాగ్రత్తలు
విదర్భలోని కాకుల్లో బర్డ్‌ఫ్లూ కనిపించడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. అయితే మనుషుల్లో ఎవరికీ బర్ల్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ కాలేదన్నారు. ఒకరికి లక్షణాలు కనిపించడంతో ఆ రిపోర్ట్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరోలజీ (NIV)కి పంపినట్టు చెప్పారు. ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలోని చికిన్ దుకాణాలు తాత్కాలికంగా మూసేశామని చెప్పారు. పుణెలో గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించడంతో అండర్‌కుక్డ్ చికిన్‌కు ప్రజలు దూరంగా ఉండాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇటీవల కోరారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.