Share News

Maha Kumbh Mela: ముగిసిన మహా కుంభమేళా

ABN , Publish Date - Feb 27 , 2025 | 05:36 AM

మహా కుంభమేళా ముగిసింది.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చివరిరోజైన బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు.

Maha Kumbh Mela: ముగిసిన మహా కుంభమేళా

  • చివరిరోజు శివరాత్రి సందర్భంగా 1.32 కోట్ల మంది పవిత్రస్నానాలు

  • 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా ప్రయాగ్‌రాజ్‌కు రాక

మహా కుంభమేళా ముగిసింది.. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చివరిరోజైన బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవా.. శంభో శంకరా అంటూ తెల్లవారు జాము నుంచే పవిత్ర సాన్నాలు ఆచరించారు. సాయంత్రం 4 గంటల వరకే 1.32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ సర్కారు తెలిపింది. కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి దాదాపు 45 రోజుల్లో 65 కోట్లకు పైగా మంది వేడుకలో పాల్గొన్నట్లు అంచనా వేసింది. కుంభామేళా ముగింపు సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఇందుకు 20 క్వింటాళ్ల గులాబీ పూలను వాడారు.

Updated Date - Feb 27 , 2025 | 05:36 AM