High Court: 1 నుంచి హైకోర్టుకు సెలవులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:17 PM
రాష్ట్ర హైకోర్టుకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ వరకు సెలవు ప్రకటించారు. అయితే.. మే 14, 15, 21 తేదీల్లో అత్యవసర కేసులపై న్యాయమూర్తులు లక్ష్మీ నారాయణన్, నిర్మల్‌కుమార్, స్వామినాథన్ తదితరులు విచారణ జరుపుతారు.

- ఐదుగురు న్యాయమూర్తుల పదవీ విరమణ
చెన్నై: మద్రాసు హైకోర్టు(Madras High Court)కు మే ఒకటి నుండి జూన్ ఒకటి వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవు దినాల్లో సెలవు కాలపు కోర్టులు పనిచేస్తాయని హైకోర్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సెలవుల్లో హైకోర్టు న్యాయమూర్తులు ఎస్.సుందర్, భవానీ సుబ్బురాయన్, హేమలత, నక్కీరన్, శివజ్ఞానం పదవీ విరమణ చేయనున్నారు. వీరికి బుధవారం హైకోర్టు ప్రాంగణంలో వీడ్కోలు సభ నిర్వహించనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు
ఈ ఐదుగురు న్యాయమూర్తుల పదవీ విరమణతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 60కి తగ్గనుంది. కోర్టు సెలవుల కారణంగా అత్యవసరమైన కేసులపై న్యాయమూర్తులు మాలా, అరుళ్‌మురుగన్, విక్టోరియా గౌరీ తదితరులు మే 7, 8 తేదీల్లో విచారణ జరుపుతారు. మే 14, 15, 21 తేదీల్లో అత్యవసర కేసులపై న్యాయమూర్తులు లక్ష్మీ నారాయణన్, నిర్మల్‌కుమార్, స్వామినాథన్ తదితరులు విచారణ జరుపుతారు.
మే 28, 29 తేదీల్లో న్యాయమూర్తులు సత్యనారాయణ ప్రసాద్, సెంథిల్‌కుమార్, రామమూర్తి, తిలకవతి తదితరులు విచారణ జరుపుతారు. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్‌లో న్యాయమూర్తులు బాలాజీ, జ్యోతిరామన్, శక్తివేల్, రామకృష్ణన్, వేల్‌మురుగన్, పూర్ణిమ, రాజశేఖర్, శ్రీమతి, విజయకుమార్, వడమలై, షమీన్ అహమ్మద్, ఆనంద్ వెంకటేష్, దండపాణి వేసవి కాలపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
Cyber Fraud: నయా సైబర్ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి
మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై కట్టడి
NHAI: ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!
Read Latest Telangana News and National News