Madras High Court Judgment: మీరేమీ సూపర్ పోలీసు కాదు
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:59 AM
మీ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనైనా దర్యాప్తు చేయడానికి మీరేమీ సూపర్ పోలీసు కాదు. లేదా ప్రతి నేర కార్యకలాపంపైనా దాడి చేయడానికి మీరేమీ..

ఈడీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
చెన్నై, జూలై 21: ‘మీ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనైనా దర్యాప్తు చేయడానికి మీరేమీ సూపర్ పోలీసు కాదు. లేదా ప్రతి నేర కార్యకలాపంపైనా దాడి చేయడానికి మీరేమీ డ్రోన్ కాదు’ అంటూ ఈడీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైకి చెందిన ఆర్‌కేఎం పవర్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.901 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్తంభింపజేస్తూ ఈడీ జనవరి 31న జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టింది. ఈ అంశం ఈడీ పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. 2006లో ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ధర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు బ్లాకులు కేటాయించడంపై దాఖలైన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆ కేటాయింపును రద్దు చేయడంతోపాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా, 2014లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా అదే ఏడాది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి 31న ఆర్‌కేఎం పవర్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆ సంస్థకు చెందిన రూ.901 కోట్ల ఫిక్స్‌డ్ డి పాజిట్లను స్తంభింపజేసింది. దీన్ని ఆర్‌కేఎం పవర్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సవాలు చేయగా.. ఈ కేసు మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ ఈడీ ఆదేశాలను ధర్మాసనం పక్కనపెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News