Share News

High Court: ఆ డీఎస్పీని సస్పెండ్‌ చేయండి..

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:26 PM

అంటరానితనం నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసుపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోట్టకుప్పం డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని డీజీపీ శంకర్‌ జివాల్‌కు హైకోర్టు ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి.

High Court: ఆ డీఎస్పీని సస్పెండ్‌ చేయండి..

- డీజీపీకి హైకోర్టు ఆదేశం

చెన్నై: అంటరానితనం నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసుపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోట్టకుప్పం డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని డీజీపీ శంకర్‌ జివాల్‌(DGP Shankar Jival)కు హైకోర్టు ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా వానూర్‌ ప్రాంతంలో 5.16 హెక్టార్ల భూములకు సంబంధించి ఆదిద్రావిడ వర్గానికి చెందిన సెంతామరై అనే మహిళకు, మరో సామాజిక వర్గానికి చెందిన వీరస్వామికి మధ్య కొన్నేళ్లుగా వివాదాలున్నాయి.


ఈ వివాదాలపై విచారణ జరిపిన దిగువ కోర్టు ఆ స్థలం సెంతామరైకి చెందినదంటూ తీర్పుచెప్పింది. ఆ తీర్పును సవాలు చేస్తూ వీరాసామి వర్గీయులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దాని పై విచారణ జరిపిన హైకోర్టు దిగువ కోర్టు తీర్పునే ఖరారు చేసింది. ఆ నేపథ్యంలో మరో సావజిఇక వర్గానికి చెందిన కేశవన్‌ అనే వ్యక్తి ఆ స్థలం తనదంటూ దిండివ నం కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతటితో ఆగకుండా సెంతామరై కుటుంబాన్ని చం పుతానంటూ బెదిరించాడు.


2023లో జరిగిన ఈ సంఘటనపై సెంతామరై వర్గీయు లు వానూరు పోలీసుస్టేషన్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆ తరువాత 2024లో ఆ భూములను పరిశీలించేందుకు వెళ్ళిన సెంతామరై బంధువును కేశవన్‌ కులం పేరుతో దూషించి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అదే సమయంలో కేశవన్‌ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సెంతామరై వర్తీయులు ఏడుగురిపై కేసులు బనాయించారు.


nani1.2.jpg

ఈ నేపథ్యంలో సెంతామరై వర్గీయులు తమను కులం పేరుతో దూషించిన కేశవన్‌ వర్గీయులపై ఎలాంటి చర్యలు తీసుకోని కోట్టకుప్పం డీఎస్పీపై చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి పి.వేల్‌మురుగన్‌ విచారణ జరిపారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్‌ విచారణకు రాగా డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా అంటరానితనం నిరోధక చట్టం ప్రకారం కేశవన్‌ వర్గీయులపై చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్‌కుమార్‌, దానికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు.


ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి పి.వేల్‌మురుగన్‌ భూములకు సొంతదారులైన సెంతామరై వర్గీయుల ఫిర్యాదును పట్టించు కోకుండా, కేశవన్‌ వర్గీయుల పిటిషన్లపైనే చర్యలు తీసుకుని, అంటరానితనం నిరోధక చట్టం ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీని సస్పెండ్‌ చేసి న్యాయస్థానంలో నివేదిక సమర్పించమంటూ డీజీపీశంకర్‌ జివాల్‌కు ఉత్తర్వులు జారీ చేసి, కేసు తదుపరి విచారణ వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 12:26 PM