Share News

Lotuses Bloom: కమలాలు పూసే.. కాశ్మీరం మురిసె

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:20 AM

ఉత్తర కశ్మీర్‌లోని వులర్‌ మంచినీటి సరస్సు తామర పువ్వులతో కళకళలాడుతోంది...

Lotuses Bloom: కమలాలు పూసే.. కాశ్మీరం మురిసె

బండిపోరా, జూలై 12: ఉత్తర కశ్మీర్‌లోని వులర్‌ మంచినీటి సరస్సు తామర పువ్వులతో కళకళలాడుతోంది! ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సరస్సులో కమలాలు విరబూశాయి. బండిపోరా జిల్లా హరముఖ్‌ పర్వత శ్రేణి నుంచి బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణం దాకా దాదాపు 24 కి.మీ మేర పొడవుతో, 200 చ.కి.మీ మేర విస్తీరించి ఉన్న వులార్‌ సరస్సు 1992 దాకా తామరలతో తళుకులీనిన సరస్సే. అయితే ఆ ఏడాది వచ్చిన వరదల కారణంగా బురద పేరుకుపోయి.. సరస్సు సోయగమే దెబ్బతింది. ఆ తర్వాత అక్కడ పద్మాలు కనిపించలేదు. స్థానికులు తామర విత్తనాలు చల్లినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు అక్కడ నీళ్ల మీద పచ్చని పాన్పు పరిచినట్లుగా తామర తీగలు.. వాటి మధ్యలో గులాబీ రంగులో పూసిన తామరలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయి.

Updated Date - Jul 13 , 2025 | 03:20 AM