MUDA Case: సీఎంకు లోకాయుక్త పోలీసులు క్లిన్‌చిట్
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:51 PM
బీఎం పార్వతి నుంచి డవలప్‌మెంట్ కోసం ముడా స్వాధీనం చేసుకున్న భూములకు కొన్ని రెట్లు విలువైన భూములను ఆమె పొందారన్నది ఈ కేసులో ఉన్న ప్రధాన అభియోగం. ఖరీదైన భూములకు తన భార్యకు దక్కేలా సిద్ధరామయ్య చేశారంటూ సమాచార హ్కకు చట్టం కింద టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు.

బెంగళూరు: మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన భార్య బీఎం పార్వతి, మరో ఇద్దరికి ఊరట లభించింది. వీరికి లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ముడా కుంభకోణంలో వీరికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను దర్యాప్తు అధికారులు హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసులో సిద్ధరామయ్య, బీఎం పార్వతితో పాటు సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున స్వామి, ల్యాండ్ ఓనర్ దేవరాజు నిందితులుగా ఉన్నారు.
Yogi Adityanath: మహాకుంభ్‌పై విమర్శలు.. రహస్యంగా మునకలు
''ఈ కేసులో మొదటి నిందితుడి నుంచి నాలుగవ నిందితుడి వరకూ వచ్చిన అభియోగాలపై తగిన ఆధారాలు లేవు. తుది రిపోర్టు హైకోర్టుకు సమర్పిస్తున్నాం'' అని లోకాయుక్త పోలీసులు.. 'ముడా' కేసు ఫిర్యాదుదారు, యాక్టివిస్ట్ స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ముడా కేసు ఏమిటి
బీఎం పార్వతి నుంచి డవలప్‌మెంట్ కోసం ముడా స్వాధీనం చేసుకున్న భూములకు కొన్ని రెట్లు విలువైన భూములను ఆమె పొందారన్నది ఈ కేసులో ఉన్న ప్రధాన అభియోగం. ఖరీదైన భూములకు తన భార్యకు దక్కేలా సిద్ధరామయ్య చేశారంటూ సమాచార హ్కకు చట్టం కింద టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశారు. వారి అభ్యర్థన మేరకు కేసు విచారణకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో ముడా కేసు సంచలనమైంది. దీంతో కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.