Share News

Leopard: పెళ్లి పందిట్లోకి చిరుతపులి

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:40 AM

బంధుమిత్రుల పలకరింపులు, మేళతాళాల మధ్య చిందులతో హడావుడిగా ఉన్న పెళ్లి పందిరిలోకి అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు..

Leopard: పెళ్లి పందిట్లోకి చిరుతపులి

  • లఖ్‌నవూలో ఘటన

లఖ్‌నవూ, ఫిబ్రవరి 13 : బంధుమిత్రుల పలకరింపులు, మేళతాళాల మధ్య చిందులతో హడావుడిగా ఉన్న పెళ్లి పందిరిలోకి అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. ఆ అనుకోని అతిథి ఎవరో కాదు.. ఓ చిరుత పులి.. ఇంకేముంది.. ఆ చిరుతను చూసి బంధు, మిత్ర సపరివారసమేతంగా వధూవరులు పెళ్లి మండపం నుంచి బయటికి పరుగు తీశారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని ఓ కల్యాణమండపంలో బుధవారం రాత్రి 11 గంటలప్పుడు ఈ ఘటన జరిగింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు మూడు గంటలకు పైగా శ్రమించి చిరుతను బంధించారు.

Updated Date - Feb 14 , 2025 | 05:40 AM