Air India: టేకాఫ్‌కు ముందే సాంకేతిక లోపం.. ఎయిర్ ఇండియా విమానం రద్దు
ABN , Publish Date - Jul 21 , 2025 | 08:59 PM
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు.

న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా (Air India) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు. టేకాఫ్‌కు ముందుగానే దీన్ని గుర్తించడంతో విమానాన్ని రద్దు చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం 160 మంది ప్రయాణికులతో విమానం కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది.
'ఏఐ2403 ఢిల్లీ-కోల్‌కతా విమానాన్ని సాయంత్రానికి రీషెడ్యూల్ చేశాం. టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఈ మార్పు చేశాం' అని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి