CBSE: పాఠశాలల్లో ఇక సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
ABN , Publish Date - Jul 21 , 2025 | 07:44 PM
రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజ్‌ను నిల్వ చేసిన చేయగల సామర్థ్యం కలిగి ఉండంతో పాటు, అధికారులు 15 రోజుల బ్యాకప్‌ను యాక్సెస్ చేయగలిగే ఉండాలని సీబీఎస్‌ఈ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: పాఠశాలల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) సోమవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలల్లోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ (Entry and exit) పాయింట్ల వద్ద ఆడియా-విజువల్ సౌకర్యం కలిగిన హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను తప్పనిసరి చేసింది. పాఠశాల లాబీలు, కారిడార్లు, మెట్లు, తరగతి గతులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, క్యాంటీన్ ఏరియా, స్టోర్‌రూమ్, ఆటస్థలం, ఇతర కామన్ ఏరియాల్లో కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ప్రైవసీ కారణంగా టాయిలెట్లు, వాష్‌రూమ్‌లను ఈ నిబంధన నుంచి మినహాయించింది.
రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజ్‌ను నిల్వ చేసిన చేయగల సామర్థ్యం కలిగి ఉండంతో పాటు, అధికారులు 15 రోజుల బ్యాకప్‌ను యాక్సెస్ చేయగలిగేలా ఉండాలని సీబీఎస్‌ఈ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. పిల్లల భద్రత కోసం తామిచ్చిన ఆదేశాలను అన్ని పాఠశాలలు తూ.చ. తప్పకుండా పాటించాలని కోరింది. ఇళ్ల నుంచి స్కూలుకు వచ్చే పిల్లలు తిరిగి వెళ్లేంత వరకూ సురక్షిత వాతావరణం కల్పించేందుకు 'స్కూల్ సేఫ్టీ' నిబంధనలు అమలు చేస్తున్నట్టు సీబీఎస్‌ఈ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
రన్‌వే దాటిన ఎయిర్ ఇండియా విమానం.. ఏం జరిగిందంటే?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి