Share News

Kharge: ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని సిద్ధమయ్యారు

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:04 AM

కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు మోదీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరించారు ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలన్నారు

Kharge: ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని సిద్ధమయ్యారు

  • గొడవ పడొద్దు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు ఖర్గే సూచన

బెంగళూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి పదవి కోసం మీరిద్దరూ గొడవ పడకండి. ప్రధాని మోదీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు’ అని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తన సొంతూరు కలబురిగిలో బుధవారం జాబ్‌మేళా ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం గొడవ పడటాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుట్రల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిద్దరామయ్య, శివకుమార్‌ను హెచ్చరించారు. నేషనల్‌ హెరాల్డ్‌ వివాదంలో కేంద్రం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీని బెదిరించాలని చూస్తోందని, కానీ గాంధీ కుటుంబం ఎప్పటికీ భయపడదని ఖర్గే స్పష్టంచేశారు. రాష్ట్రంలో కులగణన సర్వే నివేదికను తాను చూడలేదని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తరగతి గదిలో పెచ్చులూడి పడి..

ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

దుబాయిలో అసలేం జరిగింది..?

తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2025 | 03:04 AM