Share News

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:40 PM

10th class Students: తమను 10వ తరగతి పరీక్షల్లో పాస్ చేయాలంటూ విద్యార్థులు.. టీచర్లకు లంచం ఆశ చూపించారు. అందుకోసం వారు ఏం చేశారంటే.. అయితే వారు చేసిన పని చూసి టీచర్ల ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాదు.. వెంటనే వారు అప్రమత్తమయ్యారు.

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

9వ తరగతి వరకు మనం చదవినా.. చదవకున్నా.. పరీక్షల్లో పాస్ అయిపోతాం. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చదువుతాం. కానీ 10వ తరగతి పరీక్షలు. అంటేనే పబ్లిక్ పరీక్షలు. ఈ పరీక్షలు పాస్ అయితే ఆ తర్వాత మనం ఏమైనా చదవవచ్చు. అందుకే జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం. ఈ పరీక్షల్లో మంచి మార్కులు వస్తే.. పై చదువులకు ఇది తొలిమెట్టుగా అంతా భావిస్తారు. అందుకే ప్రతీ విద్యార్థి జీవితంలో ఈ పరీక్షలు ఓ మైలురాయి. ఆ క్రమంలో ఈ పరీక్షలు పాస్ అయితే.. జీవితంలో ఒక యుద్దాన్ని గెలిచినంత సంబరంగా ప్రతి విద్యార్థి భావిస్తాడు.


tenth-students.jpg

అలాంటి పదో తరగతి పరీక్ష మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లకు ఈ పరీక్ష రాసిన విద్యార్థులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని బెల్గావీ జిల్లా చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. తమను ఈ పరీక్షల్లో ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు విద్యార్థులు తమ జవాబు పత్రాల్లో రూ. 500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు.


ఇంకొందరైతే 'నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది' అని రాశారు. మరికొంత మంది 'మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండని వేడుకున్నారు. ఈ రూ.500 తీసుకోండి’’, ‘‘నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది’’, ‘‘పాస్‌ చేయకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పంపరు’’ వంటి అభ్యర్థనలు రాశారు.

ఒక విద్యార్థి రూ.500 నోటుతో పాటు ‘‘సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి’’ అసలు ఊహించని ఈ ఘటనతో పలువురు ఇన్విజిలేటర్లను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీంతో ఇన్విజిలేటర్లు వెంటన అప్రమత్తమయ్యారు. వీటిని విద్యా శాఖ ఉన్నతాధికారులకు వారు అందజేశారు. ఇక విద్యార్థులకు రాసిన అన్సర్ షీట్లలో వారు రాసిన జవాబులకు మాత్రమే ఇన్విజిలేటర్లు మార్కులు వేశారు.


మరోవైపు.. ఈ సంఘటనకు సంబంధించిన ఒక ఆన్సర్‌ షీట్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, ఒక నెటిజెన్.. ఇలా తయారయ్యారేంట్రా మీరు !’’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తూ దాన్ని షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For National News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 06:11 PM