MUDA Case: ముడా కేసులో సీఎం దంపతులకు హైకోర్టు నోటీసు
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:34 PM
ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన భార్య పార్వతి, ఇతరులకు నోటీసులు జారీచేసింది.
Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?
ముడాకు చెందిన 14 స్థలాలను అక్రమంగా తన భార్యకు కేటాయించారనే ఆరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు. లోకాయుక్త పోలీసులు చేస్తున్న విచారణను సీబీఐకి అప్పగించాలంటూ గతంలో స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై పిటిషన్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్‌వి అంజారియా, జస్టిస్ కెవి అరవింద్‌తో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారణ జరిపి సీఎం, ఆయన భార్య పార్వతికి నోటీసులు పంపింది. ఈనెల 28వ తేదీలోగా నోటీసులకు జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ అదే తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...