Elephant: పులుల కట్టడికి గజరాజు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:45 PM
మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.
- ఫరంగంలోకి కుంకీ ఏనుగులు
- ఇద్దరు రైతుల మృతిపై నిరసన
- మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన
బెంగళూరు: మైసూరు, చామరాజనగర(Mysoore, Chamaraja Nagar) జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ(Forest Department) అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు. ఇద్దరు రైతులను ఒకేరోజున పులులు దాడి చేసి చంపేయడంతో వివిధ గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు.
సోమవారం కూడా మృతదేహాలను రోడ్లపై ఉంచి ఆందోళన కొనసాగించారు. స్థానిక అటవీ అధికారులు గ్రామస్తులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్థుల డిమాండ్‌తో నరభక్షక పులిని బంధించాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రె సూచించారు. ఇందుకు అనుగుణంగా పులి పట్టివేతకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు.

సరగూరు తాలూకా ముళ్ళూరు గ్రామంలో పులి దాడిలో రైతు రాజశేఖర్ మృతి చెందగా చామరాజనగర్ జిల్లా బండిపుర అభయారణ్య పరిధిలో రైతు శివణ్ణను పులి దాడి చేసి చంపేసింది. పులిని బంధించేందుకు కుంకీ ఏనుగులు భీమ, మహేంద్ర ఏనుగులను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు. పులులను కట్టడి చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో పలువురు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
Read Latest Telangana News and National News