Share News

CM Siddaramaiah: అధిష్ఠానం నిర్ణయానికి నేను, డీకే కట్టుబడతాం

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:10 AM

ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

CM Siddaramaiah: అధిష్ఠానం నిర్ణయానికి నేను, డీకే కట్టుబడతాం

  • సీఎం మార్పు వార్తలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్‌ ఓబీసీ సలహా మండలి సమావేశం ముగిసిన అనంతరం బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సిద్దరామయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సీఎం, అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని తాను, డీకే శివకుమార్‌ పాటిస్తామని అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 06:10 AM