Bengaluru: బెంగళూరు రూరల్ జిల్లాకు బెంగళూరు నార్త్‌గా పేరు మార్పు
ABN , Publish Date - Jul 02 , 2025 | 08:55 PM
బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు పెట్టారు.

బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం (Karnataka cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు రూరల్ జిల్లా (Bengaluru rural district) పేరును 'బెంగళూరు నార్త్' (Bengaluru North)గా మార్చింది. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (Siddaramaiah) అధ్యక్షతన నందిహిల్స్‌లో బుధవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బెంగళూరు రూరల్ జిల్లాలో ప్రస్తుతం హోస్‌కోతె, దేవనహళ్లి, దొడ్డబల్లాపూర్, నేలమంగల తాలూకాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ మౌలిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరిగింది. ఈ క్రమంలో బెంగళూరు రూరల్ జిల్లాను బెంగళూరు నార్త్‌గా పేరు మార్చినట్టు క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామ్యయ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న చిక్కబళ్లాపుర జిల్లాలోని బాగేపల్లి పేరును కూడా భాగ్యనగర్‌గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
1986లో బైఫర్‌కేషన్
బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చారు.
ఇవి కూడా చదవండి..
క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి