Share News

MP Kanimozhi: మురుగన్‌ మహానాడు జరిపినా బీజేపీ బలం పెరిగే అవకాశం లేదు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:19 PM

మదురైలో మురుగన్‌ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు.

MP Kanimozhi: మురుగన్‌ మహానాడు జరిపినా బీజేపీ బలం పెరిగే అవకాశం లేదు..

- డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై: మదురైలో మురుగన్‌ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పరపతి పెరిగే అవకాశమే లేదని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) ఎద్దేవా చేశారు. కన్నియాకుమారిలో బుధవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే కూటమి మరింత పటిష్టంగానే ఉందని మిత్రపక్షాల్లో కొన్ని పార్టీలు కూటమి నుండి వైదొలగుతాయని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలన్నారు. డీపీఐ నేత తిరుమావళవన్‌ డీఎంకే నేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వాస్తవాలిలా ఉండగా డీపీఐ కూటమికి గండి కొట్టడం ఖాయమని ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం తగదన్నారు.


nani5.2.jpg

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ తామిప్పుడు మురుగన్‌ను చేతులకెత్తుకున్నామని, త్వరలో రాష్ట్రంలో అధికారాన్ని కూడా హస్తగతం చేసుకుంటామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మురుగన్‌ మహానాడు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో బీజేపీ(BJP) బలం ఏ మాత్రం పెరిగే అవకాశమే లేదని కనిమొళి చెప్పారు. బుధవారం ఉదయం కన్నియాకుమారికి వెళ్ళిన కనిమొళికి మంత్రి మనో తంగరాజ్‌, మాజీ మంత్రి సురే్‌షరాజన్‌, డీఎంకే స్థానిక శాఖ నాయకులు బాబు, తామరై భారతి, మాజీ ఎంపీ హెలెన్‌ డేవిడ్‌సన్‌, కన్నియాకుమారి పురపాలక సంఘం అధ్యక్షులు కుమరి స్టీఫన్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 19 , 2025 | 01:19 PM