BREAKING: రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:09 AM
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదు మంది.. డీఎంకే నుండి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగంతో పాటు..

తమిళనాడు, జులై 25: నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదు మంది.. డీఎంకే నుండి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగంతో పాటు మరికొంత మంది ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో డీఎంకే కూటమి మద్దతుతో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కాగా 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన కమల్ హాసన్..2021 తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటిస్తూ.. డీఎంకేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. డీఎంకే పార్టీ తమిళనాడులో తమ పార్టీ జెండా ఎగురవేసింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగు రాజ్యసభ స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంది. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.