Kannada-Tamil Row: రాజకీయ నాయకులకు ఆ అర్హత లేదు: కమల్
ABN , Publish Date - May 28 , 2025 | 09:58 PM
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసహనం వ్యక్తం చేశారు.

చెన్నై: తమిళం నుంచే కన్నడం పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వేడి పుట్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజగా దీనిపై కమల్ స్పందించారు. కేవలం ప్రేమతోనే ఆవిధంగా అన్నానని, తనతో సహా రాజకీయ నాయకులంతా ఇలాంటి చర్చలను భాషా నిపుణులకు వదిలిపెట్టాలని వివరణ ఇచ్చారు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అసహనం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, కమల్‌కు ఆ విషయం తెలియదని అనుకుంటున్నట్టు చెప్పారు.
ప్రేమతోనే..
కాగా, కమల్ దీనిపై వివరణ ఇస్తూ, కేవల ప్రేమతోనే తాను మాట్లాడానని, ఇంతకుమించి ఎలాంటి అర్ధం తన మాటల్లో లేవని అన్నారు. తమిళనాడుకు మీనన్, రెడ్డి, ఒక తమిళియన్, ఒక కన్నడిగ అయ్యంగార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారని గుర్తు చేశారు. భాష గురించి మాట్లాడే అర్హత తనతో సహా రాజకీయ నాయకులకు లేదని, దీనిపై లోతైన చర్చను చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు విడిచిపెట్టాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..
రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన
Read Latest National News and Telugu News