Kamal Hasan: అది పంచుకోవడానికే నేను సీఎంను కలిశా..
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:25 PM
సినీనటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత కమల్‌హాసన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు వ్యతిరేకంగా జరిపిన న్యాయపోరాటంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గెలిచిన ఆనందోత్సాహంలో తాను కూడా పాలుపంచుకున్నానన్నారు.

- సీఎం స్టాలిన్‌తో భేటీపై కమల్‌హాసన్
చెన్నై: ప్రముఖ సినీనటుడు, ‘మక్కల్ నీదిమయ్యం’ నాయకుడు కమల్‌హాసన్(Kamal Hasan) సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)ను మర్యాగ పూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌కు వ్యతిరేకంగా జరిపిన న్యాయపోరాటంలో ముఖ్యమంత్రి స్టాలిన్ గెలిచిన ఆనందోత్సాహంలో తాను కూడా పాలుపంచుకోవడానికే ఆయనతో సమావేశమయ్యానని కమల్ పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
గవర్నర్ విధులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, మంత్రివర్గం నిర్ణయాలను గవర్నర్ శిరసావహించాలని సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు రాష్ట్రానికే కాకుండా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. ఇంతటి చారిత్రాత్మక తీర్పును సాధించినందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అభినందనలు తెలియజేశానని కమల్ తెలిపారు.
స్టాలిన్‌తో నియోజకవర్గాల పునర్విభజన గురించి తానెలాంటి చర్చలు జరుపలేదన్నారు. అదే విధంగా రాజ్యసభ సీటును కోరే విషయమై కూడా స్టాలిన్‌తో మాట్లాడలేదని, అసెంబ్లీ ఎన్నికలకు కూడా యేడాది గడువు ఉండటంతో ఈ రెండు విషయాలు ప్రస్తావించలేదని కమల్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News