Share News

Kamal Haasan: కత్తి బహుకరించిన అభిమాని.. సహనం కోల్పోయిన కమల్

ABN , Publish Date - Jun 14 , 2025 | 09:37 PM

డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.

Kamal Haasan: కత్తి బహుకరించిన అభిమాని.. సహనం కోల్పోయిన కమల్

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) చెన్నైలో జరిపిన పార్టీ సమావేశంలో ఓ అభిమాని చూపిన అత్యుత్సాహంతో సహనం కోల్పోయారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అదే అభిమానితో కరచాలనం చేసి అక్కడి నుంచి సాగనంపారు.


సంఘటన వివరాల ప్రకారం.. డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు. ఒక అభిమాని కమల్‌కు ఒక కత్తి బహుకరించాడు. కమల్ దానిని అందుకున్నప్పటికీ కత్తి పైకెత్తాలని అభిమాని పట్టుపట్టడంతో కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి కింద పెట్టాలని గట్టిగా చెప్పడంతో అక్కడే ఉన్న పోలీసు అధికారి వెంటనే జోక్యం చేసుకుని ఆ అభిమానితో కత్తి కిందపెట్టేలా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కమల్ సదరు అభిమానితో కరచాలనం చేసి నవ్వుతూ అక్కడి నుంచి సాగనంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.


ఇవి కూడా చదవండి..

అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..

నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 09:44 PM