Share News

Siddaramaiah: కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట...

ABN , Publish Date - May 29 , 2025 | 01:03 PM

కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట.. అంటూ తమిళ నటుడు కమల్‌హాసన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళభాష నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్‌హాసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

Siddaramaiah: కన్నడ చరిత్ర గురించి ఆయనకేం తెలుసట...

- థగ్‌లైఫ్‌ సినిమాను రిలీజ్‌ చేయకండి: కన్నడసంఘాలు

బెంగళూరు: తమిళభాష నుంచి కన్నడ పుట్టిందంటూ తమిళ నటుడు కమల్‌హాసన్‌(Kamal Hasan) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. థగ్‌లైఫ్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమల్‌హాసన్‌ కన్నడభాష పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం విధానసౌధలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) స్పందిస్తూ.. కమల్‌హాసన్‌కు కన్నడ భాష గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేం ద్ర, ప్రతిపక్షనేత అశోక్‌ తదితరులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమల్‌హాసన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కమల్‌ మంచి నటుడు కావచ్చని, అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడితే స హించేది లేదన్నారు. కమల్‌హాసన్‌ నటించిన థగ్‌లైఫ్‌ సినిమాను కర్ణాటకలో విడుదల చేయరాదని కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్న డ భాషపట్ల అనుచితంగా మాట్లాడిన వ్యక్తి సినిమా అవసరం లేదన్నా రు. నగరంలో పలు చోట్ల కర్ణాటక రక్షణావేదిక (కరవే) నారాయణగౌడ, ప్రవీణ్‌శెట్టి, వివిధ వర్గాలు వేర్వేరుగా నిరసనలు తెలిపాయి.


pandu2.2.jpg

ఫిలించాంబర్‌ వద్ద కన్నడ అభిమానులు ఆందోళన చేశారు. నటుడు, ఎంపీ జగ్గేశ్‌ బెంగళూరులో స్పందిస్తూ కళలకు కులం, భాష లేదని అందుకే కమల్‌హాసన్‌ను అభిమానించామని, కానీ కన్నడభాషను తక్కువ చేసి మా ట్లాడితే సహించేది లేదన్నారు. కన్నడకు 2,500 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. నటుడు చేతన్‌ మాట్లాడుతూ కన్నడకంటే తమిళం ప్రాచీనం కావచ్చని, అయితే తమిళం నుంచి కన్నడ పుట్టలేదన్నారు. రెండు భాషలకు ద్రవి డం మూలమైనా తమిళభాషలో పుట్టిందనేది సమంజసం కాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క

ఒకే మాటపై ఉందాం!

Read Latest Telangana News and National News

Updated Date - May 29 , 2025 | 01:03 PM