Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
ABN , Publish Date - Feb 20 , 2025 | 08:54 PM
దాదాపు నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్న టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. పరీక్షకు ముందే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు రెండు పరీక్షలను రద్దు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇటీవల బిహార్ బీపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ వివాదం మరువక ముందే, తాజాగా జార్ఖండ్‌లో టెన్త్ బోర్డు పరీక్షల పేపర్స్ లీకయ్యాయి (Jharkhand Board Exam). అందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ 10వ తరగతి హిందీ, సైన్స్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే హిందీ పరీక్ష ఫిబ్రవరి 18న జరుగగా, సైన్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరగాల్సి ఉంది. ఈ రెండు సబ్జెక్టుల పునఃపరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో కోడెర్మా ప్రాజెక్ట్ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ ప్లస్ 2 స్కూల్, జామ్జా హై స్కూల్ సహా అనేక పరీక్షా కేంద్రాలలో లీకైన ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లు జేఏసీ తెలిపింది. వైరల్ అయిన ప్రశ్నాపత్రాలు పరీక్షలో అడిగిన ప్రశ్నలతో సరిపోలడం వల్ల లీక్ అయినట్లు నిర్ధారించారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను జార్ఖండ్‌లో పలు రకాల వాట్సాప్ గ్రూపుల ద్వారా విక్రయించినట్లు గుర్తించారు.
ఇది కాకుండా ప్రశ్నాపత్రాలను QR కోడ్‌ల ద్వారా కూడా పంచుకున్నారని తేలింది. ఈ విషయంపై మరింత సమాచారం సేకరిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ పేపర్ల లీక్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్తుపై భయాందోళన చెందుతున్నారు.
10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గట్టి భద్రత నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లో దాదాపు 7.84 లక్షల మంది విద్యార్థులు ఈ బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. 10వ తరగతి పరీక్ష మొదటి షిఫ్ట్‌లో (ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు), 12వ తరగతి పరీక్ష రెండవ షిఫ్ట్‌లో (మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 వరకు) జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,297 పరీక్షా కేంద్రాల్లో 4.33 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరుకానుండగా, 789 పరీక్షా కేంద్రాల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షకు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి:
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News