Jaishankar: ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
ABN , Publish Date - May 26 , 2025 | 05:29 PM
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి పాకిస్థాన్‌కు ముందుగానే సమాచారం ఇవ్వడంతో భారత్ పంపిన రాఫెల్ జెట్ల సహా పలు యుద్ధవిమానాలను కూల్చేశారని, వాటి వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) ఎట్టకేలకు స్పందించారు. సైనిక దాడులపై ముుందే తాను సమాచారం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇవి నిజాయితీ లోపించిన ఆరోపణలని, వాస్తవాలను వక్రీకరించారని అన్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఎంపీలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు జైశంకర్ స్పష్టత ఇచ్చారు.
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని, విపక్షాలు చెబుతున్నట్టు ఆపరేషన్ ప్రారంభం కావడానికి ముందుమాత్రం కాదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ముందుగానే పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చినట్టు జైశంకర్ బహిరంగంగానే అంగీకరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల వరుస ఆరోపణలు గుప్పించారు. ఇంతటి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఇండియాకు చెందిన ఎన్ని విమానాలను కోల్పాయామో చెప్పాలని డిమాండ్ చేశారు. జైశంకర్ మాట్లాడుతున్న ఒక వీడియోను కూడా రాహుల్ షేర్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. జైశంకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ఆపరేషన్‌కు ముందే పాక్‌కు సమాచారం ఇచ్చినట్టు జైశంకర్ ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది.
యూఎస్ మధ్యవర్తిత్వంపై..
కాగా, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం, ఆమెరికా మధ్యవర్తిత్వంపై ఎంపీలు జైశంకర్‌ను ప్రశ్నించగా, ఆపరేషన్ సులభతరం చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. యూఎస్‌తో మాట్లాడినప్పుడు డీజీఎంఓ స్థాయిలో మాత్రమే చర్చలు జరగాలని భారత్ చాలా స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
సింధు జలాల ఒప్పందంపై..
సింధు జలాల ఒప్పందంపై కూడా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఒప్పందాన్ని పునఃప్రారంభించే ఆలోచన కానీ, సవరించే ఆలోచన కానీ ఇండియాకు ఉందా అని అడిగినప్పుడు, ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, ఇప్పటికిప్పుడు కేంద్రానికి దీనిపై ఎలాంటి పునరాలోచన లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Narendra Modi: మేడిన్ ఇండియా వస్తువులు ఉపయోగించాలి..వారి అభివృద్ధికి పాటు పడాలి
Rains: నైరుతీ రుతుపవనాల ప్రభావం.. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు
For National News And Telugu News