Ballari: ఆ ఇద్దరి మధ్య స్నేహ బంధం చెడినట్లేనా..
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:51 PM
ప్రాణ స్నేహితులమని చెప్పుకునే వారిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అందరూ అనుకునేవారు.. కానీ పరస్పరం బురద జల్లుకునే పరిస్థితి రావడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది.

- గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు మధ్య పెరిగిన దూరం
- ప్రాణస్నేహితుల మధ్య భగ్గుమన్న విభేదాలు ఫ వ్యక్తిగతంగానే కాదు.. పార్టీకీ తీరని నష్టం
బళ్లారి(బెంగళూరు): ప్రాణ స్నేహితులమని చెప్పుకునే వారిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అందరూ అనుకునేవారు.. కానీ పరస్పరం బురద జల్లుకునే పరిస్థితి రావడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. గాలి జనార్దన్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, శ్రీరాములు(Gali Janardhan Reddy, Karunakar Reddy, Somasekhar Reddy, Sriramulu) తాము నలుగురు సోదరులమని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసలు వీరి స్నేహం చెడడానికి కారణం ఏమిటి.. అంటే ఇంతకాలం స్వార్థంతోనే కలిసిమెలసి తిరిగారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Minister: ఉన్ని జ్వరంపై మాజీ సీఎం అవాస్తవాలు..
శ్రీరాములు రాజకీయ అడుగులు..
1990 ముందు నుంచి శ్రీరాములు బళ్లారి రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. 1994 ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. 1996 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బళ్లారి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. కానీ అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే ముండ్లూరు దివాకర్‌బాబు ఉండడంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ శ్రీరాములుకు దక్కలేదు. 1999 మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి శ్రీరాములు బీజేపీలో చేరారు. బళ్లారికి సుస్మస్వరాజ్ పోటీ తరువాత క్రమేపీ బీజేపీ బలపడింది.
సంకీర్ణంలో బ్రదర్సే కీలకం..
1999 వరకూ బళ్లారి మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతిలో ఉంది. 2004లో లో బీజేపీ నుంచి 16 మంది దళం నుంచి ఇద్దరు కౌన్సిలర్లు గెలిచారు. అప్పుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2002 వరకూ జనార్దన్‌రెడ్డి బళ్లారిలో ఎన్నొబుల్ ఇండియా అనే ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తుండేవాడు. తర్వాత మైనింగ్‌వైపు అడుగులు వేశారు. అప్పడే గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు స్నేహ బంధం బలంగా ఎదిగింది. 2008లో నియోజక వర్గం పెరిగి రూరల్ స్థానం ఎస్టీకి రిజర్వు కావడం వల్ల శ్రీరాములు బళ్లారి రూరల్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బళ్లారి నగర ఎమ్మెల్యేగా గాలి సోమశేఖర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఇలా వీరందరూ బీజేపీ, దళం మిశ్రమ ప్రభుత్వలో అధికారం అనుభవించారు. 2006లో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వంలో అనిశ్చితి ఏర్పడింది. జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుపట్టారు. అప్పుడు రాజకీయ చాతుర్యతతో బళ్లారి బ్రదర్స్ తిరిగి యడియూర్పనే ముఖ్యమంత్రి చేశారు.
మైనింగ్‌తోనే బలపడ్డారు..
2004లో మైనింగ్‌తో రూ. వందల, వేల కోట్లుకు పడుగులెత్తారు. జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు జోడిని ఎదురించాలంటే ఎవరితరం కాలేదు. ముఖ్యమంత్రులు సైతం వీరి అనుమతి లేకుండా బళ్లారి వచ్చే పరిస్థితి లేదన్నట్లు తయారయ్యింది. 2011లో లోకాయుక్త గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy)ని అరెస్టు చేసింది. అప్పుడు బీజేపీ వదిలి గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు కలిసి బీఎ్‌సఆర్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ నుంచే కంప్లి సురేష్, గాలి సోమశేఖర్‌రెడ్డి, ఇలాకొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తరువాత దాన్ని మూసేని తిరిగి బీజేపీలో చేరుపోయారు. జనార్దన్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా శ్రీరాములు బళ్లారి నుంచి మైసూర్ వరకు పాదయాత్ర చేశారు.
దాదాపు 40 నెలలు అంటే మూడున్నరేళ్ల గాలి జనార్దన్‌రెడ్డి జైల్లోనే ఉన్నారు. తరువాత 2015 జనవరి లో గాలి జనార్దన్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బళ్లారి, కర్నూ లు, అనంతపురం జిల్లాలకు వెళ్లరాదని షరతులు విధించింది. 11 ఏళ్ల పాటు గాలి బళ్లారికి దూరంగానే ఉన్నాడు. అప్పడే శ్రీరాములు ఒక మాస్ లీడర్‌గా ఎదుగుతూ వచ్చారు. 1999 నుంచి అనేక సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలుస్తూ వచ్చారు. 2024లో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో శ్రీరాములు ఓడిపోయాడు.
గడిచిన నాలుగేళ్లగా శ్రీరాములు, జనార్దన్‌రెడ్డి మధ్య స్నేహం దూరమైతూ వచ్చింది. జనార్దన్‌రెడ్డి ఆస్తులు శ్రీరాములు, ఆయన అల్లుడు సురే్‌షబాబు, పేర్లతో ఉంచారు. జనార్దన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆస్తుల వివాదం పెరిగింది. బినామీ పేరుతో ఉంచిన తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని జనార్దన్‌రెడ్డి అడిగితే సురేష్ బాబు ఇవ్వలేదని గాలి అత్యంత సన్నిహితులతో పాటు జనార్దన్‌రెడ్డి కూడా ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సురే్‌షబాబు తన మనస్సు నొప్పించేలా ప్రవర్తించారని గాలి పలుమార్లు పేర్కొన్నారు. ఎన్నికల గాలి కేఆర్‌పీపీ పార్టీ ప్రారంభించారు. అయితే ఎవరూ వెంట రాకపోవడంతో తిరిగి బీజేపీలోనే చేరారు.
సమస్య అంతా సండూరుతోనే..
సండూరు ఉప ఎన్నికల బీజేపీ ఓటమికి శ్రీరాములు కూడా ఒక కారణం అనేది ఇప్పుడు వివాదానికి దారి తీసింది. వాస్తవానికి సండూరు కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ సంతోష్ లాడ్ లాంటి కాకలు తీరిన రాజకీయ నాయకులూ ఉన్నారు. అంతే కాకుండా జనార్దన్‌రెడ్డి బలపడిచే వ్యక్తి బంగారు హనుమంత ను గెలిపిస్తే తిరిగ జనార్దన్‌రెడ్డి హవా సండూరుపై పడుతుందని, మైనింగ్ యజమానులంతా ఏకమై బీజేపీని ఓడించారు. ఇందులో శ్రీరాములు తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండుమూడు రోజులుగా గాలి , శ్రీరామలు బహిరంగ సవాళ్లతో బీజేపీలో కలకలం రేపుతోంది. వీరి గొడవలు పార్టీకి నష్టం తెస్తాయని పలువురు భావిస్తున్నారు. అన్నదమ్ములమని చెప్పుకునే వీరు ఎందుకిలా బజారున పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News