Share News

Mallikarjun Kharge: మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి.. ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే

ABN , Publish Date - Jul 27 , 2025 | 07:11 PM

రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకే ధన్‌ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలియదని, ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షానే ఉండేవారని, అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.

Mallikarjun Kharge: మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి.. ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే
Mallikarjun Kharge

బెంగళూరు: ఆరోగ్య కారణాలతో ఉప రాష్ట్రపతి పదవికి జూలై 21న జగ్‌దీప్ ధన్‌ఖఢ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేసినప్పటికీ ఆయన రాజీనామాకు కారణాలపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కూ మధ్య అంశమని అన్నారు. అసలైన కారణం ఏమిటనే దానిపై తనకు సమాచారం లేదని చెప్పారు.


రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకే ధన్‌ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ, ఆ విషయాలు తనకు తెలియవని, ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షానే ఉండేవారని, అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.


రాజ్యసభ చైర్మన్‌గా జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన హయాంలో ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారని, కీలక అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలకు తరచు అనుమతి నిరాకరించేవారని ఖర్గే వ్యాఖ్యానించారు. రైతులు, పేదలు, అంతర్జాతీయ అంశాలు, విదేశాంగ విధానం వంటి పలు అంశాలపై ఏరోజూ రాజ్యసభ చైర్మన్‌గా ఆయన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. దళిత మహిళలు, దళితులు, అట్టడుగు వర్గాలపై అకృత్యాలు, హిందూ-ముస్లిం ఘర్షణల ఘటనలు వంటి అంశాలపై నోటీసులు ఇచ్చి ప్రస్తావించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా తమకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారనేది ఆయనకు, మోదీకి మధ్య అంశమని, ఆ కారణం ఏమిటనేది చెప్పాల్సింది కూడా ఆయనేనని అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 07:12 PM