ISRO: స్పేడెక్స్‌లో రెండో డాకింగ్ కూడా సక్సెస్
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:01 AM
ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయిని చేరింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలకు రెండోసారి డాకింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేసింది.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) మిషన్‌లో భాగంగా ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్‌లో ప్రయోగించిన ఎస్‌డీఎస్స్-01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్-02 (టార్గెట్) అనే జంట ఉపగ్రహాలకు రెండోసారి డాకింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో సోమవారం ప్రకటించింది. పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్ ద్వారా గతేడాది డిసెంబరు 30న స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. ఈ ఏడాది జనవరి 16న ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా డాకింగ్ చేసింది. మార్చి 13న వాటిని అన్‌డాకింగ్ కూడా చేసింది.