Lalit Modi: మరోసారి హాట్ టాపిక్‍గా మారిన లలిత్ మోదీ.. ఈసారి ఎందుకంటే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:45 PM
వనువాతు గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకున్న వారికి ఆ దేశం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది. ఈ పాస్ పోర్ట్ ద్వారా పౌరసత్వం పొందితే అక్కడ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు.

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) గురించి మరోసారి పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. పసిఫిక్ ద్వీప దేశం వనువాటు పౌరసత్వం (vanuatu citizenship) ఆయన తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ ఛైర్మన్‍గా ఉన్న సమయంలో లలిత్ మోదీ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2010లో లలిత్ మోదీ.. భారత్ వదిలి లండన్ వెళ్లిపోయారు. అప్పట్నంచీ ఆయన లండన్‌లోనే ఉంటున్నారు.
అయితే తాజాగా వానువాటు ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ (Vanuatu Golden passport) కార్యక్రమం కింద లలిత్ మోదీ ఆ దేశ పౌరసత్వం పొందారు. అలాగే తన ఇండియన్ పాస్‌పోర్టును లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయంలో అప్పగించేందుకు దరఖాస్తు సైతం చేసుకున్నారు. దీనిపై భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పందించారు. లలిత్ దరఖాస్తును పరిశీలిస్తామని చెప్పారు. వనువాటు పౌరసత్వం పొందాడని తెలిసిందని, అయినా చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే భారత్ నుంచి విచారణ తప్పించుకునేందుకే వనువాటు పౌరసత్వం తీసుకున్నారని తెలుస్తోంది.
వనువాటు ప్రత్యేకత ఏంటంటే..
వనువాతు గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకున్న వారికి ఆ దేశం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది. ఈ పాస్ పోర్ట్ ద్వారా పౌరసత్వం పొందితే అక్కడ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. స్థానికంగా, అంతర్జాతీయంగా ఎంత సంపాదించినా సరే ట్యాక్స్ అనే మాటే ఉండదు. దీర్ఘకాలిక లాభాలు సహా స్టాక్స్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత ఆదాయం సంపాదించినా వాటిపైనా పన్నులు ఉండవు. అలాగే వనువాతులో కంపెనీని రిజిస్టర్ చేసుకుని విదేశాల్లో ఉంటూ ఆదాయం పొందిలా ఎలాంటి అభ్యంతరాలు చెప్పదు ఆ దేశం. కార్పొరేట్ పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్‌లూ ఉండవు. క్రిప్టో హబ్‌గానూ ఆ దేశం వృద్ధి చెందుతుండడంతో ఈ వీసాకు డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్-20204లోనూ వనువాతు తొలిస్థానంలో నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Rekha Gupta: మహిళా దినోత్సవం... నెలకు రూ.2,500 సాయానికి కేబినెట్ ఆమోదం
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ