Intel: ఇంటెల్‌లో 10వేల మంది ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:06 AM
వచ్చే నెలలో ఇంటెల్ ఫౌండ్రీ విభాగంలో 15-20శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించనుంది...

న్యూఢిల్లీ, జూన్ 19: సెమీకండక్టర్ తయారీ దిగ్గజం ఇంటెల్ భారీగా ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో ఇంటెల్ ఫౌండ్రీ విభాగంలో 15-20శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపనుంది. ఎలాంటి పరిహారం, ప్రయోజనాలను ఇవ్వకుండానే ఉద్యోగులను తొలగించనుంది. బాధాకరమే అయినప్పటికీ సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇంటెల్ మాన్యుఫ్యాక్చరింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నాగ చంద్రశేఖరన్ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మొమోలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిచోట్ల ఉన్న 15 వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లపై ఈ ప్రభావం ఉంటుంది.