Indian Railways: రైల్వే ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు జారీ.. ఇవి మీకు తెలుసా..
ABN , Publish Date - Jul 03 , 2025 | 08:07 PM
భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంతోపాటు, ప్రయాణికులకు ముందుగానే తమ స్థితి తెలుసుకునే అవకాశాన్ని కల్పించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రయాణీకుల(Indian Railways) సౌకర్యార్థం భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రైళ్ల రిజర్వేషన్ చార్ట్‌ల (Railway Reservation Chart) సమయంలో కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు సంబంధించిన మొదటి రిజర్వేషన్ చార్ట్ ముందురోజు రాత్రి 9 గంటలకు తయారవుతుంది. మిగిలిన రైళ్లకు అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత లేదా అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు.. ఈ చార్ట్ రైలు బయలుదేరే సమయానికి 8 గంటల ముందు సిద్ధం చేస్తారు.
సౌకర్యం కోసం మార్పులు
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మార్పులను ప్రయాణీకుల సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. 2015లో రైల్వే మంత్రిత్వ శాఖ మొదటిసారిగా రిజర్వేషన్ చార్ట్ తయారీకి నిర్దిష్ట నిబంధనలను రూపొందించింది. అప్పటి నుంచి రైలు బయలుదేరే సమయానికి కనీసం 4 గంటల ముందు మొదటి చార్ట్ సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు, ఈ కొత్త నియమాలతో ప్రయాణీకులకు మరింత సమయం లభించడం ద్వారా వారి ప్రయాణాన్ని మెరుగ్గా ప్లాన్ చేసుకునే ఛాన్సుంది.
చార్ట్ తయారీ వివరాలు
రైల్వే బోర్డు జులై 2న జారీ చేసిన సర్క్యులర్‌లో ఈ వివరాలను తెలిపింది. ఈ మార్పులు అన్ని రైల్వే జోన్‌లకు వర్తిస్తాయి. అయితే, ఈ నియమాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో లేదా రెండో రిజర్వేషన్ చార్ట్ తయారీలో ఎలాంటి మార్పులు ఉంటాయో సర్క్యూలర్‌లో స్పష్టం చేయలేదు. మొదటి చార్ట్ రైలు బయలుదేరే 8 గంటల ముందు సిద్ధమైన తర్వాత, ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్‌లను కరెంట్ బుకింగ్ సౌకర్యం ద్వారా బుక్ చేసుకోవచ్చు. రెండో చార్ట్ రైలు బయలుదేరే 30 నిమిషాల నుంచి 5 నిమిషాల ముందు సిద్ధమవుతుంది.
ఎలాంటి నిబంధనలు లేవు
ఈ రెండో చార్ట్ ప్రధానంగా కరెంట్ బుకింగ్ ద్వారా టిక్కెట్లు తీసుకునే ప్రయాణీకుల కోసం వినియోగిస్తారు. 2015కి ముందు, రిజర్వేషన్ చార్ట్ తయారీకి నిర్దిష్ట సమయం లేదు. వివిధ రైల్వే జోన్‌లు వేర్వేరు నిబంధనలను పాటించేవి. ఈ అస్పష్టతను తొలగించి, ప్రయాణీకులకు సౌలభ్యం కల్పించేందుకు రైల్వే బోర్డు 2015లో ఈ ప్రక్రియను ప్రామాణికం చేసింది. కొత్తగా 8 గంటల గ్యాప్ నిర్ణయం బికనీర్ రైల్ డివిజన్‌లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా తీసుకున్నారు.
మార్పు వల్ల..
ఈ పైలట్‌లో రిజర్వేషన్ చార్ట్‌ను 24 గంటల ముందు సిద్ధం చేసే ప్రయత్నం చేశారు. ఆ అనుభవం ఆధారంగా, 8 గంటల గ్యాప్ సముచితమని నిర్ణయించారు. ఈ మార్పు వల్ల ప్రయాణీకులు తమ టిక్కెట్ కన్ఫర్మ్ అయిందా, లేదా? అనే అనిశ్చితి నుంచి బయటపడి ప్రయాణాన్ని ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. రైలు బయలుదేరే 48 గంటల నుంచి 12 గంటల మధ్య టిక్కెట్ రద్దు చేస్తే, టిక్కెట్ ధరలో 25 శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రద్దు వల్ల ఖాళీ అయిన సీట్లు లేదా బెర్త్‌లను కరెంట్ బుకింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి