Indian Navy: మిసైల్స్ పరీక్షలు సక్సెస్.. యుద్ధానికి సిద్ధంగా నావికా దళం..
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:53 PM
దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికీ సిద్ధంగా ఉన్నామని నావికాదళం పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇండియా- పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత నావికా దళం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికీ సిద్ధంగా ఉన్నామని నావికాదళం పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో భారత నావికా దళం నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఈ యుద్ధనౌకల్లో కోల్‌కతా-క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి, క్రివాక్-క్లాస్ ఫ్రిగేట్‌లు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించారు. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ సూరత్.. గగనతలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నౌకాదళం విడుదల చేసింది.
ఉగ్రదాడి నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ భారతదేశంతో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి భాతర సైన్యాన్ని రెచ్చగొడుతూ పదే పదే కాల్పులు జరుపుతున్నారు. అయితే పాకిస్తాన్ సైన్యం కాల్పులకు.. భారత్ సైన్యం దీటుగా జవాబు ఇచ్చింది. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. కాగా, 'మన్ కీ బాత్' రేడియో ప్రసారంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ఉగ్రవాదులను భూమి అంచుల వరకు వెంబడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాద దాడితో ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని, ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధను.. భారతీయులందరూ అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్
అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు
అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య
Read Latest and International News