Share News

India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:20 AM

పాకిస్తాన్ తీరు మారలేదు, మళ్లీ కాల్పుల విరమణకు పాల్పడింది. ఇదే సమయంలో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చాటి చెప్పింది.

 India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్
India Pakistan Ceasefire

జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏప్రిల్ 27, 28 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ సంఘటనలో, పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు లేకుండా చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ క్రమంలో వెంటనే స్పందించిన భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌లో, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఈ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం రాత్రి సమయంలో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించింది. సమాచారం ప్రకారం, పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్‌ను కూడా ఉపయోగించింది.


కాల్పుల విరమణ ఒప్పందం

ఈ దాడులు దాదాపు గంటసేపు కొనసాగాయి. అయితే, భారత సైన్యం తమ ప్రాంతాల నుంచి తగిన రీతిలో స్పందించి, పాకిస్తాన్ దాడులను విఫలం చేశాయి. ఈ సంఘటనలో భారత వైపు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 2003లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, సరిహద్దులో శాంతిని నెలకొల్పడానికి ఒక కీలకమైన నిర్ణయంగా పరిగణించబడుతుంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. 2021లో రెండు దేశాలు కాల్పుల విరమణను మరోసారి అంగీకరించినప్పటికీ, పాకిస్తాన్ తరచూ ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తోంది. కుప్వారా, పూంచ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి.


భారత సైన్యం స్పందన

భారత సైన్యం ఎల్లప్పుడూ సరిహద్దు వెంబడి అప్రమత్తంగా ఉంటుంది. ఈ సంఘటనలో కూడా, పాకిస్తాన్ కాల్పులకు భారత సైనికులు వెంటనే బదులిచ్చారు. భారత సైన్యం తమ ఆయుధాలతో పాకిస్తాన్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. దీంతో పాకిస్తాన్ దాడి వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో భారత సైన్యం సరిహద్దులో శాంతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన తర్వాత కూడా సరిహద్దులో భారత సైన్యం అప్రమత్తంగా ఉందన్నారు.


సరిహద్దులో ఉద్రిక్తత

జమ్మూ కశ్మీర్‌లోని LOC వెంబడి ఉద్రిక్తతలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులను చొరబడేలా ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. భారత సైన్యం ఈ రెండు రకాల దాడులను కూడా తిప్పికొడుతోంది. ఈ సందర్భంగా కూడా, భారత సైన్యం తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించింది.


ఇవి కూడా చదవండి:

India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 08:23 AM