China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్, లద్దాఖ్‌లో కొత్తగా రెండు కౌంటీలు.. భారత్ అభ్యంతరం
ABN , Publish Date - Jan 03 , 2025 | 09:05 PM
చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా తాము చూసామని, ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని జైశ్వాల్ తెలిపారు.

న్యూఢిల్లీ: టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా (China) భారీ డ్యామ్ నిర్మించేందుకు సిద్ధపడుతుండటం, లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో కొత్తగా రెండు స్థావరాలను (New Counties) ఏర్పాటు చేయడంపై భారత్ (India) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు అంశాలపై దౌత్య మార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్టు భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారంనాడు తెలిపారు.
Arvind Kejriwal: రూ.8,400 కోట్ల విమానంలో తిరిగేది, రూ.10 లక్షల సూట్ వేసుకునేదెవరు?
"టిబెట్ అటానమస్ రీజియన్‌లో యార్గంగ్ జాంగ్బో నదిపై చైనా హైడ్రోపవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని 2025 డిసెంబర్ 25న జిన్హువా విడుదల చేయడం భారత్ దృష్టికి వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించాం. పారదర్శకతతో పాటు దిగువ దేశాలతో సంప్రదింపులు జరపాల్సి అవసరాన్ని కూడా వారి దృష్టికి తెచ్చాం'' అని జైశ్వాల్ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి మన దేశ ప్రజలను విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
కొత్త కౌంటీలు చట్టవిరుద్ధం
చైనాలోని హోటాన్ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన కూడా తాము చూసామని, ఈ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుందని జైశ్వాల్ తెలిపారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని అంగీకరించలేదని, కొత్త కౌంటీలు ఏర్పాటు వల్ల భారత్‌కు చిరకాలంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. చట్టవిరుద్ధమైన ఆక్రమణలు, బలవంతపు ఆక్రమణల వల్ల చట్టబద్ధత లభించదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
CT Ravi: సువర్ణసౌధ ఘటనపై సీటీ రవి ఆగ్రహం
Flights Delayed: ప్రయాణికులకు అలర్ట్.. దాదాపు 200 విమానాలు ఆలస్యం, రద్దు
For National News And Telugu News