Rain Alert: సమ్మర్‌లో మళ్లీ వర్షాలు..24 వరకు ఈ ప్రాంతాల్లో దంచుడే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 07:36 AM
ఎండా కాలంలో వర్షాలు చాలా ఉపశమనం అందిస్తాయి. కానీ ఇదే వర్షాలు గ్యాప్ లేకుండా కురిస్తే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటి వరకు దంచి కొట్టిన వర్షాలు మళ్లీ ఉన్నాయంటా. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.

సమ్మర్ టైంలో వానలు బాగానే ఉంటాయని చెప్పవచ్చు. కానీ వరుసగా కురిస్తే మాత్రం ప్రజలకు ఇక్కట్లు తప్పవు. అంతేకాదు ఈ వానల కారణంగా జమ్మూ కశ్మీర్లో కొండచరియలు కూలిపోయి నిన్న ముగ్గురు మరణించారు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ (IMD) ఏప్రిల్ 21న జమ్మూ కశ్మీర్‌కు మళ్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో వర్షాలతోపాటు గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
ఈ రాష్ట్రాల్లో వానలు..
జమ్మూ కశ్మీర్‌తో పాటు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా ప్రాంతాల్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికంగా వరదలు, అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతోపాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందట. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
అప్రమత్తంగా ఉండాలని సూచన
మరోవైపు వర్షాలు దంచేస్తుంటే వాయవ్య, మధ్య భారతదేశంలో మాత్రం హీట్‌వేవ్ హడలెత్తిస్తోంది. విదర్భ, దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వడగాలుల వీచే ఛాన్సుంది కాబట్టి, బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News