Share News

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 02:55 PM

దేశంలో ఓ వైపు ఎండలు దంచి కొడుతుండగా, మరోవైపు మాత్రం వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్ 17 నుంచి 19 వరకు పలు రాష్ట్రాల్లో వానలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
IMD Issues Weather Alert

దేశంలో వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రాంతాలైన ఢిల్లీ ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కారైకల్, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకతో సహా అనేక దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది.


తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షాలు

ఇదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఏప్రిల్ 17న బీహార్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌లోని గంగా నది ప్రాంతంలో బలమైన గాలులు (గంటకు 50–60 కి.మీ. వేగంతో) వీచే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు ఏప్రిల్ 20 నుంచి 22 వరకు నిరంతర వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.


రాజధాని ప్రాంతాల్లో..

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఏప్రిల్ 17 నుంచి 19 వరకు పశ్చిమ, తూర్పు రాజస్థాన్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో, గురువారం 40°C (గరిష్టంగా), కనిష్టంగా 25°C ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అంచనా వేశారు. ఈ క్రమంలో వేడి, పొడి పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు. కొన్ని చోట్ల మేఘావృతమై ఉన్నప్పటికీ, ఏప్రిల్ 18 వరకు దేశ రాజధానిలో వేడి నుంచి పెద్దగా ఉపశమనం లభించదని ప్రకటించారు.


జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా

ఏప్రిల్ 18, 19 తేదీల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వాతావరణం మారడం వల్ల ప్రజలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఉత్తర్ ప్రదేశ్‌ వాతావరణం

ఉత్తర్ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో రోజంతా తేలికపాటి వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు యూపీలోని లక్నో, వారణాసి, జౌన్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఘాజీపూర్, చందౌలి, మీర్జాపూర్ వంటి ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ యూపీలో కూడా తేలికపాటి చినుకులు పడవచ్చని అంచనా వేశారు.

వాతావరణ మార్పుల ప్రభావం

ఈ వాతావరణ మార్పులు ప్రజల జీవనశైలిపై ప్రభావం చూపించవచ్చు. వేడి, వర్షాల మధ్య మార్పులు, వ్యవసాయ కార్యకలాపాలు, నీటి సరఫరా, ఆరోగ్య పరిస్థితులు, మరెన్నో అంశాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..


Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..


iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..


Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 17 , 2025 | 06:09 PM