Share News

Jai Shankar: ఉగ్రవాదంతో రెచ్చగొడితే ఇంటికొచ్చి మరీ దాడులు.. పాక్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:19 PM

పహల్గాం ఉగ్రదాడికి జవాబుగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నెల రోజుల అనంతరం యూరప్‌లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Jai Shankar: ఉగ్రవాదంతో రెచ్చగొడితే ఇంటికొచ్చి మరీ దాడులు.. పాక్‌కు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

బ్రసెల్స్: ఉగ్రదాడులతో రెచ్చగొడితే పాక్‌స్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి మరీ భారత్ దాడులు చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) దాయాది దేశాన్ని హెచ్చరించారు. పహల్గాం వంటి పాశవిక ఉగ్రదాడులకు టెర్రరిస్టు సంస్థలు, వారి నేతలు పాల్పడితే దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. 'ఉగ్రవాదులు ఎక్కడ దాక్కునా ఖాతరు చేయం. పాకిస్థాన్ లోపల దాక్కున్నా... అక్కడికీ చొచ్చుకెళ్లి దాడులు చేస్తాం' అని జైశంకర్ తెలిపారు.


పహల్గాం ఉగ్రదాడికి జవాబుగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నెల రోజుల అనంతరం యూరప్‌లో జైశంకర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బెల్జియం, లక్సంబర్గ్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు బహిరంగంగానే పాకిస్థాన్ శిక్షణ ఇస్తూ, వారిని ఇండియాపైకి ఉసిగొలుపుతోందని కేంద్రమంత్రి దుయ్యపట్టారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. భారత్‌పై దాడులకు ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా పాకిస్థాన్ మార్చుకుందని, ఇదే రెండు దేశాల మధ్య సమస్యలకు దారితీస్తోందని చెప్పారు.


పాక్‌తో గత నెలలో యుద్ధం చెలరేగడానికి దారి తీసిన పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? అనే ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు. ఉగ్రవాదంతో ఉద్రిక్తతలు పెంచడానికే వాళ్లు కట్టుబడి ఉంటే ఆ పరిస్థితులు ఉన్నట్టేనని ఆయన సమాధానమిచ్చారు. యుద్ధం సందర్భంగా జరిగిన నష్టంపై కేంద్రమంత్రిని ప్రశ్నించగా.. సంబంధిత అధికారులు ఇందుకు సిద్ధంగా ఉన్నప్పుడు వెల్లడిస్తారని చెప్పారు. ఉగ్రవాదం అనేది ఏ రెండు దేశాలకో సంబంధించిన అంశంగా చూడరాదని, ప్రపంచ సమస్యగానే చూడాలని అన్నారు. ఈ సమావేశంలో బెల్జియం విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రెవోట్ సైతం పాల్గొన్నారు.


కర్ణాటకలో మళ్లీ కులగణన.. అధిష్ఠానం ఆదేశం

తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 08:20 PM