Share News

Tejaswai Yadav: నితీష్ తనయుడు రాజకీయాల్లోకి వస్తే... తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 22 , 2025 | 09:38 PM

తన తండ్రి 100 శాతం ఫిట్‌గా ఉన్నారని, ఆయనకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు నిశాంత్ కుమార్ ఇటీవల చేసిన విజ్ఞప్తిపై తేజస్వి మాట్లాడుతూ, ఆయన తండ్రి కంటే మా తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్) మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని చమత్కరించారు.

Tejaswai Yadav: నితీష్ తనయుడు రాజకీయాల్లోకి వస్తే... తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తనయుడు నిశాంత్ కుమార్ (Nishant Kumar) రాజకీయ అరంగేట్రం చేయనున్నారంటూ కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఆదివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిశాంత్ రాజకీయాల్లోకి వచ్చి జేడీయూను బీజేపీ నుంచి, ఇతర భాగస్వామ్య పార్టీల నుంచి కాపాడితే తాను సంతోషిస్తానని అన్నారు.

MK Stalin: రూ.10,000 కోట్లు ఇచ్చినా ఎన్ఈపీకి నో ఎంట్రీ: స్టాలిన్


తన తండ్రి 100 శాతం ఫిట్‌గా ఉన్నారని, ఆయనకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు నిశాంత్ ఇటీవల చేసిన విజ్ఞప్తిపై తేజస్వి మాట్లాడుతూ, ఆయన తండ్రి కంటే మా తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్) మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని చమత్కరించారు. బడుగు వర్గాలకు లాలూ చేసినట్టు ఇంకెవరకూ చేయలేదని, ఆయన హయాంలోనే బీహార్‌లో మండల్ కమిషన్ సిఫారస్సులను అమలు చేశారని గుర్తుచేశారు.


నిశాంత్ వస్తే హ్యాపీ..

"నిశాంత్ రాజకీయాల్లోకి వస్తే నేను సంతోషిస్తున్నాను. ఇందువల్ల శరద్ యాదవ్ స్థాపించిన జేడీయూకు కొత్త జవజీవాలు వస్తాయని ఆశిస్తున్నాను. నితీష్ కుమార్‌ను నమ్మకపోవడం వల్లే శరద్ యాదవ్‌ను ప్రధాని మోదీ హైజాక్ చేశారు. ఇప్పుడు వారి భాగస్వాములుగా ఉన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, జితిన్ రామ్ మాంఝీలు కూడా నితీష్‌ మీద కత్తులు నూరినవాళ్లే. నిన్న మొన్నటి వరకూ ఈ భాగస్వామ్య పార్టీలన్నీ నితీష్ కుమార్ మానసిక ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నించిన వాళ్లే'' అని తేజస్వి అన్నారు. నిశాంత్ తనకు సోదరుడు వంటి వాడని, ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, ఆయన వివాహం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆయన అనుకుంటే రావచ్చని వ్యాఖ్యానించారు.


ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 47 ఏళ్ల నిశాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, నితీష్ కానీ, నిశాంత్ కానీ ఇంతవరకూ దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 22 , 2025 | 09:38 PM