Share News

AIIMS On Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌తో పెరుగుతున్న మృతులు.. స్పందించిన ఎయిమ్స్

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:42 PM

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయంటూ తీవ్ర చర్చ జరుగుతుంది. అలాంటి వేళ.. ఐసీఎంఆర్, న్యూఢల్లీలోని ఎయిమ్స్ స్పందించాయి.

AIIMS On Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌తో పెరుగుతున్న మృతులు.. స్పందించిన ఎయిమ్స్
New Delhi AIIMS

న్యూఢిల్లీ, జులై 03: కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆకస్మిక గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయంటూ ప్రచారం ఉధృతంగా సాగుతుంది. అలాంటి వేళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్పందించింది. కోవిడ్ మరణాలను తగ్గించడంలో ఈ వ్యాక్సిన్లు ప్రభావంతంగా పని చేశాయని.. ఆ సమయంలో ఇవి కీలక పాత్ర పోషించాయని తెలిపింది. గురువారం ఎయిమ్స్ పల్మనరీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కరణ్ మాదన్ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి విస్తరించిన సమయంలో ప్రాణాలు రక్షించడానికి వ్యాక్సిన్లు ఒక్కటే మార్గమైయిందని తెలిపారు.


దేశంలో భారీ సంఖ్యలో ప్రజలు.. వ్యాక్సిన్లు వేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ సమయంలో మృతుల సంఖ్యను నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వ్యాక్సిన్లు ద్వారా ప్రజలు అద్భుతమైన ప్రయోజనాలు పొందారన్నారు. ఇప్పటి వరకు వినియోగించిన వ్యాక్సిన్లను సమీక్షించడానికి ఆకస్మిక గుండె మరణాలపై అధ్యయనం సైతం జరిగిందని తెలిపారు. అయితే ఆకస్మాత్తుగా సంభవిస్తున్న గుండె మరణాలకు స్పష్టమైన కారణాలు అయితే ఇంకా కనుగొన లేదన్నారు.


కోవిడ్ టీకాల కారణంగానే.. ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యాయనాలు నిర్వహించాయి. దీంతో కోవిడ్ వ్యాక్సిన్‌కు, ఈ ఆకస్మిక మరణాలకు ఎటువంటి సంబంధం లేదని అవి నిర్ధారించాయి. జీవనశైలితోపాటు ముందుగా ఉన్న అనారోగ్య కరణంగానే ఈ మరణాలు సంభవించాయిని తెలిపింది. ఆ క్రమంలో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో సుదీర్ఘ అధ్యయనం జరిపి.. ఈ మేరకు ప్రకటన చేశాయి.


రాష్ట్రంలో గుండె పోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లు కారణమై ఉండ వచ్చంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ మరునాడు ఐసీఎంఆర్, ఎయిమ్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇంకోవైపు కోవిడ్ వైరస్ నేపథ్యంలో ది సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సైతం స్పందించింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ కోవిడ్‌షీల్డ్ సురక్షితమని వెల్లడించింది. ఆకస్మిక గుండె పోటు మరణాలకు తమ వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా సదరు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి.

వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2025 | 03:50 PM