Share News

Rahul Gandhi: అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:06 PM

తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇది తన శపథమని అన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలని, తమ శక్తిని తాము తెలుసుకోకపోవడమే కొందరి సమస్యని అన్నారు.

Rahul Gandhi: అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ
Rahul gandhi

న్యూఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయామని, అది ముమ్మాటికీ తన తప్పదమేనని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన భాగిదారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు తాను ఓ తప్పు చేశానని అర్ధమవుతోందని అన్నారు. ఓబీసీల హక్కులను రక్షించాల్సిన విధంగా రక్షించలేదని, అప్పట్లో ఓబీసీల సమస్యలను లోతుగా అర్ధం చేసుకోలేకపోయానని పేర్కన్నారు.


'మీ (ఓబీసీ) చరిత్ర, సమస్యలను కొంచెం ముందుగానే తెలుసుకుని ఉన్నట్లయితే అప్పట్లోనే కులగణన చేపట్టి ఉండేవాడిని. అది కాంగ్రెస్ పార్టీ తప్పుకాదు, ముమ్మాటికీ నా తప్పే. ఇప్పుడు ఆ తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాం' అని రాహుల్ అన్నారు.


తెలంగాణ రోల్‌మోడల్

తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇది తన శపథమని అన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలని, తమ శక్తిని తాము తెలుసుకోకపోవడమే కొందరి సమస్యని చెప్పుకొచ్చారు. దేశంలో దళితుల చరిత్రను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? ఎవరు రాశారు? అని ప్రశ్నించారు రాహుల్. ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఓబీసీలు అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని రాహుల్ నిలదీశారు. అదానీ ఓసీసీనా, మీడియా రంగంలో ఓబీసీలకు స్థానం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో విద్యదే కీలకపాత్ర అని, ఇంగ్లీషు నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయని అన్నారు. బీజేపీ నేతలు ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ భాషలు ముఖ్యమేనని, ఇంగ్లీషూ ముఖ్యమేనని చెప్పారు. ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు తీసుకురావాలని రాహుల్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

భారత్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ అనిల్ చౌహాన్

డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 05:18 PM